- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి మంత్రి శ్రీధర్ బాబుకు పిలుపు..
మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆదివారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో డివిజన్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, మంథని : మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆదివారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో డివిజన్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబుకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. మంథని డివిజన్ కేంద్రంలో మొట్టమొదట పురుడు పోసుకున్న డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని మంత్రి శ్రీధర్ బాబును ప్రెస్ క్లబ్ బృందం కోరారు. దీంతో సానుకూలంగా స్పందించి తప్పకుండా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోతుకూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొడారి మల్లేష్, సహాయ కార్యదర్శి మాదరబోయిన కిషన్, కమిటీ సభ్యులు పొన్నం శ్రీనివాస్, వెల్మ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గువ్వల రమేష్, మహేందర్, వాసు, తిరుపతి, కుమార్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు.






