హాట్ టాపిక్...ఎమ్మెల్యే సంజయ్ కుమార్ VS జీవన్ రెడ్డి

by Bhanu |

గత కొద్దికాలంగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి తయారయింది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు అటు కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

హాట్ టాపిక్...ఎమ్మెల్యే సంజయ్ కుమార్ VS జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : గత కొద్దికాలంగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి తయారయింది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు అటు కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా సోమవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి గాంధీభవన్ వేదికగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశిస్తూ ఆయన ఇండిపెండెంట్ అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జగిత్యాల లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి అని చెప్పుకుంటున్న మీరు జగిత్యాల అభివృద్ధికి చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. భూస్వాములు అని సంబోధించడంపై మండిపడ్డ ఎమ్మెల్యే తామేమి అరాచకాలు చేయలేదని.. మమ్మల్ని ఎవరు చంపలేదు మేము ఊరు విడిచి వెళ్లలేదు అంటూ జీవన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటుగా స్పందించారు.

జోక్యం చేసుకొని పీసీసీ, పార్టీ పెద్దలు

కారు పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ తర్వాత హస్తం గూటికి చేరారు. సంజయ్ చేరికపై కనీసం సమాచారం కూడా లేకపోవడంతో అప్పటినుండి జీవన్ రెడ్డి పార్టీ పెద్దల తీరు పట్ల ముభావంగా ఉన్నారు. దీంతో సందర్భం వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతూ వస్తున్నాయి. తాను అభివృద్ధిని ఆశించే పార్టీలో చేరానని సంజయ్ కుమార్ చెబుతున్నప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం ఆయన చేరికను స్వాగతించడం లేదు. ఇంత జరుగుతున్న మాజీ మంత్రికి పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే కు మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దేందుకు అటు పీసీసీ తో పాటు పార్టీ పెద్దలు కూడా జోక్యం చేసుకోవడం లేదు. దీంతో డిసిసి అధ్యక్షుడిగా ఉన్న ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిస్థితి ఈ ఇద్దరి నాయకుల మధ్య అడ కత్తెరలో పోక చెక్కలా మారింది. ఈ నాయకుల మధ్య ఉన్న విభేదాలను అసలు కాంగ్రెస్ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సెకండ్ క్యాడర్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి

జగిత్యాల లో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఇద్దరు లీడర్ల మధ్య ఉన్న విభేదాల కారణంగా కాంగ్రెస్ లో ఉన్న సెకండ్ క్యాడర్ లీడర్లు చక్రబంధంలో పడిపోయారు. ఓవైపు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఎటువైపు ఉండాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. కొందరు లీడర్లు అయితే కొద్దిరోజులు జీవన్ రెడ్డి వెంట మరికొద్ది రోజులు సంజయ్ కుమార్ వెంట ఉంటున్నారు. కొద్ది నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో ఎవరి వైపు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. లాంగ్ స్టాండింగ్ పాలిటిక్స్ లో ఉన్న కింది స్థాయి లీడర్లైతే న్యూట్రల్ గా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే జగిత్యాల కాంగ్రెస్ పెద్ద ఎత్తున గ్రూపు రాజకీయాలకు వేదిక కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story