రాష్ట్రంలో రైతే రాజు.. దేశం చూపు తెలంగాణ వైపు : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్

by Disha Web Desk 1 |
రాష్ట్రంలో రైతే రాజు.. దేశం చూపు తెలంగాణ వైపు : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
X

దిశ, శంకరపట్నం : రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతో దేశం చూపంతా తెలంగాణ వైపే ఉందని, రాష్ట్రంలో రైతే రాజని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ, దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మండలములోని కాచాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన రైతు వేదికను మానకొండూరు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారధి చైర్మన్ రసమయి బాలకిషన్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోండ్ర రాజయ్య, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయికి గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల ఖాతాల్లో సాలుకు రూ. పదివేలు జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు రైతు బీమా తో రూ.5 లక్షలు చెక్కు అందజేస్తున్నామని తెలిపారు.

రైతు సంక్షేమానికి బీడు భూములను సాగు భూములుగా తీర్చిదిద్దేందుకు ప్రాజెక్టులను కట్టి, మిషన్ కాకతీయ పథకంతో చెరువులను మరమ్మత్తు చేసి, రైతులకు పంట సాగు కోసం 24 గంటల ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ సరోజన, వైస్ ఎంపీపీ రమేష్, గ్రామ సర్పంచ్ కొండ్ర రాజయ్య, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వీరస్వామి, ట్రైనీ కలెక్టర్, తాహసీల్దార్, ఎంపీడీవో, ఏవో, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్, జిల్లా కో-ఆర్డినేటర్, పంచులు ఎంపీటీసీలు అనుబంధ సంఘాల నాయకులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Next Story

Most Viewed