జగిత్యాల జిల్లాలో రెండు బల్దియాలు కాంగ్రెస్ ఖాతాలోకి

by Ratna Kumari |

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికర చిత్రాన్ని ఆవిష్కరించాయి.

జగిత్యాల జిల్లాలో రెండు బల్దియాలు కాంగ్రెస్ ఖాతాలోకి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికర చిత్రాన్ని ఆవిష్కరించాయి. ధర్మపురి, కోరుట్ల మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా రాయికల్, మెట్పల్లిలో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. జగిత్యాలలో మాత్రం విభిన్న రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి. ధర్మపురిలో మొత్తం 15 వార్డులన్నింటినీ గెలుచుకుని కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగా, కోరుట్లలో 33 వార్డుల్లో 18 స్థానాలు సాధించి మ్యాజిక్ ఫిగర్ దాటింది. దీంతో రెండు బల్దియాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. రాయికల్‌లో 12 వార్డుల్లో బీజేపీ 5, కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, ఒక ఇండిపెండెంట్ గెలవడంతో ఏ పార్టీకి 7 మ్యాజిక్ ఫిగర్ రాలేదు. బీజేపీ–బీఆర్ఎస్ కూటమి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెట్‌ప‌ల్లిలో 26 వార్డులకు బీజేపీ 10, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్లు 4 స్థానాలు గెలిచారు. ఇక్కడ 14 స్థానాల మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు బీజేపీ ఇండిపెండెంట్ల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.

జగిత్యాల లో భిన్న పరిస్థితి..

జగిత్యాలలో మొత్తం 50 వార్డుల్లో కాంగ్రెస్ 23 స్థానాలు కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 26 దాటనప్పటికీ ఇద్దరు ఎంఐఎం నుండి గెలిచిన కౌన్సిలర్ల మద్దతుతో పాటు ఇండిపెండెంట్ గా గెలిచిన నలుగురు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగిత్యాల మున్సిపల్ పీఠం కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడనుంది.అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ పోరు కారణంగా ఎవరు చైర్పర్సన్ అవుతారు అన్నది సస్పెన్స్ గా మారింది.

Next Story