- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Leaf art : రావి ఆకు మీద దాశరథి చిత్రం
by Chintha Aamani |
దాశరధి కృష్ణమాచార్యులు జయంతిని పురస్కరించుకొని

X
దిశ, గొల్లపల్లి : దాశరధి కృష్ణమాచార్యులు జయంతిని పురస్కరించుకొని మండలంలోని రాఘవ పట్నం గ్రామానికి చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్,రచయిత గాలిపెల్లి చోళేశ్వర్ చారి రావి ఆకు మీద దాశరథి చిత్రాన్ని చిత్రీకరించారు.ఈ సందర్భంగా చారి మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వ పోరాటంలో తన కలంతో నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ నందించిన మహాకవి దాశరథి అని తెలిపారు. తన సాహిత్యం ద్వారా సమాజంలో పీడిత జనాలలో, యువతలో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారని, పలు సినిమాలకు గేయ రచయితగా పని చేయడంతో పాటు కేంద్ర సాహిత్య పురస్కారాలతో తెలంగాణ పేరును నలుదిశల వ్యాపింపచేశరని కొనియాడారు.
Next Story






