- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లతో
జమ్మికుంట మండలంలోని వావిలాల, నాగారం గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది.

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని వావిలాల, నాగారం గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు ఇసుక వ్యాపారులు. జమ్మికుంట నుంచి ఇల్లందకుంట, కమలాపూర్, హన్మకొండ వరకు కూడా భారీ మొత్తంలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ పెద్ద ఎత్తున క్యాష్ చేసుకుంటోంది ఇసుక మాఫియా.
చెక్‌పోస్ట్ తొలగింపుతో జోరుగా అక్రమరవాణా
జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామంలోని చెక్ పోస్ట్ తొలగించడం ఇసుకాసురులకు వరంగా మారింది. ఇక తమకు అడ్డేలేదన్నట్లుగా ఇసుక వ్యాపారులు జోరుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఇల్లంతకుంట, కమలాపూర్, హన్మకొండ వరకు తరలించి భారీ మొత్తంలో విక్రయిస్తున్నారు.గతంలో ఉన్న వావిలాల చెక్ పోస్టును తొలగించడంతో ఇసుకాసురులకు అడ్డూచెప్పేవారు లేకుండాపోయారు. ఇదే అదునుగా భావించిన అక్రమ వ్యాపారులు..పెద్ద ఎత్తున ఇసుకను తరలించి, సొమ్ముచేసుకుంటున్నారు.
పోలీసుల సహకారం లభిస్తోందా.?
ఇసుక మాఫియాకు పరోక్షంగా పోలీసుల సహకారం లభిస్తోందని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లకు కనీసం నెంబర్ ప్లేట్లు కూడా ఉండటం లేదు. జమ్మికుంట మండలంలోని వావిలాల, నాగారం గ్రామాల నుంచి అక్రమ రవాణా చేసిన ఇసుకను ఒక్కో ట్రాక్టర్‌కు కమలాపూర్‌లో రూ.9000 చొప్పున విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు అక్రమ వ్యాపారులు.
డ్రైవర్లు మైనర్లే... ర్యాష్ డ్రైవింగ్.!
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు మైనర్లే. మైనర్ డ్రైవర్ల ద్వారానే ఇసుక మాఫియా యథేచ్చగా కొనసాగుతోంది. అంతేకాదు.. ట్రాక్టర్‌లను నడిపే మైనర్లు ఓ చేతితో ఫోన్ మాట్లాడుతూ.. మరో చేతితో మాత్రమే డ్రైవింగ్ చేస్తూ.. అది కూడా ఓవర్ స్పీడ్‌తో నడపడం ద్వారా ఇతర వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ యజమాని, ఇసుక డ్రైవర్‌తో ఫోన్‌లో టచ్‌లో ఉంటూ.. పట్టణంలో గస్తీ కాస్తూ.. వారి ట్రాక్టర్ పట్టణం దాటే వరకు అక్కడి తాజా పరిస్థితులను వివరిస్తూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ట్రాక్టర్లను సేఫ్‌గా పట్టణం దాటిస్తున్నారు. ఈ తతంగం మొత్తం ఇసుక మాఫియా కనుసన్నల్లోనే జరుగుతున్నప్పటికీ.. వీరిని కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.
నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా.!
ఇసుకను అక్రమంగా తరలించే ట్రాక్టర్లకు కనీసం నెంబర్ ప్లేట్ కూడా ఉండటం లేదు. ఓ వైపు మైనర్లు డ్రైవర్లు, మరోవైపు.. నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లతో జమ్మికుంట పట్టణం నడిబొడ్డు నుంచి భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఈ విధంగా అక్రమంగా తరలించిన ఇసుకను భారీ మొత్తంలో విక్రయిస్తూ మ్ముచేసుకుంటున్నారు ఇసుకాసురులు. ఇంటిని నిర్మించుకునే పేద, మధ్యతరగతి ప్రజలపై ఇసుక పెద్ద భారంగా మారుతోంది. ఓ వైపు ప్రభుత్వం టోకెన్ సిస్టమ్‌ను అమలు చేయకపోవడం ఇసుకాసురులకు వరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సైతం ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఇళ్లను నిర్మించుకునే సాధారణ ప్రజలకు ఇసుక తిప్పలు తప్పడం లేదు. మరి ఇప్పటికైనా జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించి, ఇసుక మాఫియాకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఇసుక కొరత లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందా.? లేదా.? అన్నది చూడాలి.






