లైట్ లేని ట్రాక్టర్ వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా

by Bhanu |

రాయికల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది.

లైట్ లేని ట్రాక్టర్ వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా
X

దిశ, రాయికల్: రాయికల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. రాత్రి పూట ఇసుక తరలించే వాహనాలకు ముందర వచ్చేది మనుషుల, జంతువుల అనేది ఎరుగగకుండ వాహనాలు అజాగ్రత్తగా నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. దీంతో ఇసుక ఉన్న నది పరివాహక ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. రాయికల్ మండలంలోని నది పరివాహక గ్రామాలూ ఇటిక్యాల , బోర్నపల్లి, కొత్తపేట, మూటపెల్లి , జగన్నాధ్పూర్ నుండి ఇసుక అక్రమ వ్యాపారాలు రేయింబవళ్లు నిత్యం ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం మెతక వైఖరి వ్యవహరిస్తోంది.

సెల్ ఫోన్ లైట్ ఆధారంగా గమ్య స్థానాలకు ఇసుక

అక్రమ ఇసుక తరలించే వాహనాలు ఎలాంటి ఫీట్ నెస్ కలిగి ఉండగపోగా రాత్రి పూట ఇసుక తరలించే వాహనానికి హెడ్ లైట్స్ లేక డ్రైవర్ తన సెల్ ఫోన్ లైట్స్ తో వాహనాన్ని తోలుకుంటూ గమ్య స్థలాలకు ఇసుకను తరలిస్తున్నారు. తాజాగా కొత్తపేట గ్రామంలో ఇదే సంఘటన ఎదురవగా లైట్ లేని వాహనాన్ని గుర్తించి డ్రైవర్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా అతివేగంతో డ్రైవర్ సెల్ ఫోన్ లైట్ వెలుతురులులో రాయికల్ నుండి కొత్తపేట వాగు వరకు నడుపుకుంటూ తీసుకెళ్లిన్నట్లు తెలిసింది. కొన్ని సందర్భాలలో మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు తెలిసింది. ఇలాంటి సంఘటనలతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. వాహనాలకు లైట్లు ఉండేలా చూసుకోవాలని, మైనర్లను వాహనాలు ఇవ్వకుండా రవాణా శాఖ అధికారులను కోరుతున్నారు.

ఇటిక్యాల పెద్ద వాగులో పరిమితికి మించి ఇసుక తవ్వకాలు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వాగుల నుండి ఇసుక రవాణా చేయడానికి మండలంలో రిచ్ లను ఏర్పాటు చేసింది . అందులో భాగంగా ఇటిక్యాల గ్రామాన్నిఇసుక రిచ్ గ్రామంగా ఎంపిక చేసింది. ఇంత వరకు బాగానే ఉన్న ఏకధాటికి ఇసుకను అక్కడి నుండి తరలించడంతో వాగులో అయిపోయి బొందలు ఏర్పడ్డాయి. పరిమితికి మించి ఇసుక తరలించడంతో భూగర్భా జలాలు అడుగంటి పోతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

అక్రమ టెండర్లకు దేవుడి పేరుతో చిట్టీల ....

ఇసుక అక్రమ తరలింపు కోసం మండలంలోని ఓ గ్రామంలో విడిసి కమిటీ దేవుడి పేరున చిట్టీలు ఇచ్చి ఇసుక రవాణాను ప్రోత్సహిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ప్రతి ట్రాక్టర్ కు రూ 300 ధర చెల్లించాలని హుకుం జారీ చేసినట్లు వినికిడి..

అతివేగంతో ఇసుక వాహనాలు వెళ్తున్నాయి : ఉప్పుల బ్రహ్మచారీ , రాయికల్

మా కాలనిలో అక్రమంగా ఇసుక తరలించే వాహనాలు అతివేగంతో వెళ్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మైనర్లు వాహనాలు నడుపుతున్నారు. ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు భయ భ్రాంతులకు గురి అవుతున్నారు.


Next Story