అనుమతులు లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు

by Bhanu |   (  Updated:2025-05-14 16:21:18  IST  )

జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలోని చాకిరి కుంట, అంకుశవాలి కుంట చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతున్నారని సిపిఎం మండల సహాయ కార్యదర్శి వడ్లూరి కిషోర్ అన్నారు.

అనుమతులు లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు
X

దిశ, జమ్మికుంటటౌన్ : జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలోని చాకిరి కుంట, అంకుశవాలి కుంట చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతున్నారని సిపిఎం మండల సహాయ కార్యదర్శి వడ్లూరి కిషోర్ అన్నారు. స్థానిక SRSP AE కి ఫిర్యాదు చేసిన జెసిబిని, ట్రాక్టర్లను, పట్టుకొని సీజ్ చేశామని చెప్పినా. అయినా కానీ మరుసటి రోజు నుండి యధావిధిగా మళ్లీ మట్టి తవ్వకాలు తవ్వుతున్నారని పేర్కొన్నారు. ఈ చెరువు కుంటలను తవ్వడం కూడా చాలా లోతుగా తవ్వకాలు జరపడం వలన మూగజీవులు నీళ్లు తాగడానికి ఇబ్బందులు ఏర్పడతాయని అదేవిధంగా మనుషులు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయని అన్నారు. స్థానిక అధికారుల అండదండలతో క్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. వెంటనే అక్రమ మట్టిత తవ్వకాలపై జిల్లా కలెక్టర్ మరియు ఎస్సారెస్పీ అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎస్సారెస్పీ SRSP,DE,AE ఆఫీసులను ముట్టడించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.



Next Story