- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్ మున్సిపల్ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ హుజూరాబాద్ నూతన మండల కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ హుజూరాబాద్ నూతన మండల కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపాలిటీ పార్కులో నిర్వహించిన కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికుల హక్కుల పోరాటమే లక్ష్యంగా కింది సభ్యులతో కూడిన కొత్త కమిటీని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
అధ్యక్షులుగా ఎండి అజ్జు, కార్యదర్శిగా బొరగల రాజుకుమార్, కోశాధికారిగా రామగిరి సులోచన, ఉపాధ్యక్షులుగా రాచపల్లి సరోజన, రెంటాల అన్నపూర్ణ, రాసవల్లి క్రాంతి, సహాయ కార్యదర్శులు కొలువురి కుమార్, రెంటాల రాజేశ్వరి, ప్రచార కార్యదర్శిగా రాజేష్ సోషల్ మీడియా ప్రతినిధిగా మొలుగూరి సతీష్, కమిటీ సభ్యలుగా రెంటాల భాగ్య, మిడిదొడ్డి సుశీల, రెంటాల మహేష్, బండ స్వామి, కొండపర్తి కుమార్, బోరగల బొందయ్య, ములుగు వినోదలను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొప్పుల శంకర్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి నూతన కమిటీ నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.






