- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్ ‘మున్సిపల్’ పోరు.. రేపే తుది తీర్పు
హుజురాబాద్ మున్సిపాలిటీ రెండో సాధారణ ఎన్నికల సమరం క్లైమాక్స్ దశకు చేరుకుంది.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మున్సిపాలిటీ రెండో సాధారణ ఎన్నికల సమరం క్లైమాక్స్ దశకు చేరుకుంది. పట్టణ ఓటరు తన ‘ముద్ర’తో ఎవరి తలరాతను రాశారో తేలేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. బుధవారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోగా రేపు (శుక్రవారం) ఉదయం వెలువడనున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. లెక్కింపు కోసం మొత్తం 5 హాల్‌లను సిద్ధం చేశారు.30 టేబుళ్లపై ఏకకాలంలో ఓట్ల లెక్కింపు సాగనుంది. సమయాన్ని ఆదా చేసేలా కేవలం ఒక్క రౌండ్‌లోనే ఫలితాలు వెలువడేలా ప్లాన్ చేశారు. 30 మంది సూపర్ వైజర్లు, 60 మంది అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొంటున్నారు.
నిఘా నీడలో ‘లెక్కింపు’ కౌంటింగ్ కేంద్రం
చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. గుర్తింపు కార్డులు ఉన్న ఏజెంట్లను మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం లోపే హుజురాబాద్ మున్సిపల్ పీఠంపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో స్పష్టత రానుంది. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ణీత సమయానికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు.






