కట్టుకున్నవాడే కాల యముడయ్యాడు...

by Bhanu |   (  Updated:2025-05-02 14:43:57  IST  )

అగ్నిసాక్షిగా మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిసి నూరేళ్ళు తోడుగా ఉంటా అని ప్రమాణం చేసిన ఓ భర్త తన భార్యను అతి కిరాతంగా హతమార్చి ఏమి ఎరుగని అమాయకుడి లా నటించాడు

కట్టుకున్నవాడే కాల యముడయ్యాడు...
X

దిశ, కొడిమ్యాల : అగ్నిసాక్షిగా మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిసి నూరేళ్ళు తోడుగా ఉంటా అని ప్రమాణం చేసిన ఓ భర్త తన భార్యను అతి కిరాతంగా హతమార్చి ఏమి ఎరుగని అమాయకుడి లా నటించాడు .....తిర ఇంట్లో నుండి దుర్వాసన బయటికి రావడంతో కిరాతకుడి అసలు రూపం బయటకి వచ్చింది. స్థానిక ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం. కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన అవుదుర్తి మహేందర్ కు గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన మమత(35) కు 20 సంవత్సరాల క్రితం వివాహం కాగా సంతానలేనితో బాధపడుతున్నారు, ఈ క్రమంలో మహేందర్ కుటుంబంలో ఆస్తి తగాదాలు చెలరేగడంతో దానికి మమత నే కారణమని మహేందర్ తల్లిదండ్రులు, తమ్ముళ్లు పెళ్లి సమయంలో కట్న కానుకలు తీసుకురాలేదని మానసికంగా వేధించ సాగారు. అయితే కుటుంబ కలహాలతో విసిగిపోయిన మహేందర్ తన భార్యను చంపాలని నిర్ణయించుకునీ, మండల కేంద్రంలోని స్వగృహంలో ఏప్రిల్ 26వ తేదీన హత్య చేసి, మృతురాలి తల్లిదండ్రులకు తన భార్య కనిపించుటలేదని తప్పుడు సమాచారం ఇవ్వగా,మృతురాలి తల్లితండ్రులు తమ కూతురి ఆచూకీ కోసం గాలించి చివరకు కరీంనగర్ వన్ టౌన్ లో గత నెల 28 తారీకు నా పిర్యాదు చేశారు.

కాగా కూతురి జాడ కోసం వారు అల్లుడిని నిలదీయగా అతను దాటా వేసే సమాదానలు ఇవ్వడంతో అనుమానం వచ్చి శుక్రవారం కొడిమ్యాల లోని వారి ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉండడంతో చుట్టూ పక్కల వారు కూడా దుర్వాసన వస్తుందని తెలపడంతో ఇంటి లోపలికి వెళ్ళి చూడగా కుళ్ళి పోయిన స్థితిలో మమత మృత దేహం ఉండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ఘటన జరిగిన తీరును పరిశీలించి, మృతురాలి తల్లి రాచకొండ పద్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.


Next Story