- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి కుండపోత
by velandi.Saikiran |
జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

X
దిశ, జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ముందుగా ఈదురు గాలులు ప్రారంభమై, అనంతరం రాత్రి సమయంలో కుండపోతగా వర్షం పడింది. అకాల వర్షం కారణంగా రహదారులపై నీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగినట్లు సమాచారం.ఇదిలా ఉండగా, మామిడి తోటలలో పిందలు రాలిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతల మార్పులతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ అకాల వర్షం మరింత నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.
Next Story






