- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంజన్న క్షేత్రం.. కాషాయ శోభితం.. ముగిసిన జయంతి ఉత్సవాలు.
జై హనుమాన్ నామస్మరణతో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం మారు మోగింది.

దిశ, కొండగట్టు: జై హనుమాన్ నామస్మరణతో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం మారు మోగింది. మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలలో చివరి రోజైన గురువారం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ మాలదారులతో ఆలయ పరిసరాలు కాషాయ శోభితంగా మారాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి అంజన్నను దర్శించుకున్నారు. గురువారంతో జయంతి ఉత్సవాలు ముగిసినప్పటికీ మరో రెండు రోజులపాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.
స్వామి వారికి పట్టు వస్త్రాలంకరణ
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం ఉదయం ద్రవిడ ప్రబంధ పారాయణము లు చేసి,అనంతరం విశేషభిషేకం తులసి అర్చన చేశారు.అనంతరం స్వామి వారికి భద్రాచలం శ్రీ రామచంద్రుని ఆలయం నుంచి తీసుకు వచ్చిన పట్టు వస్త్రాలను అలంకరించారు. సాయంత్రం మరిన్ని ప్రత్యేక పూజల అనంతరం సహస్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ,సామూహిక భజన,తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన పూజ కార్యక్రమాలతో హనుమాన్ జయంతి ఉత్సవాలు ముగిసినట్లుగా ఆలయ అర్చకులు తెలిపారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా
బుధవారం నుండి విరామం లేకుండా వర్షం కురుస్తున్న భక్తులు మాత్రం ఏ మాత్రం లెక్కచేయకుండా లక్షలాది గా తలివచ్చి తమ ఇష్టా దైవాన్ని దర్శించుకొని,దీక్షలు విరమించారు. ఆలయ అధికారులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎండ ల నుండి భక్తులకు ఉపశమనం కలిగించడానికి వై జంక్షన్ వద్ద ఉన్న కమాన్ ప్రాంతం నుండి టెంట్లు,కార్పెట్లు ఏర్పాట్ చేయగా వర్షం కురవడంతో అధికారులు చేసిన ప్రయత్నం వృదా అయిపోయింది. మరోవైపు భక్తులకు హనుమాన్ జయంతి సందర్భంగా స్వర్గీయ పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే తో పాటు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పోయి వస్తాం అంజన్న.. సల్లంగ చూడు తండ్రి
ఈ నెల 20 వ తారీకు నుండి జయంతి ఉత్సవాలు ప్రారంభమవ్వగా 21 వ తారీకు సాయంత్రం నుండి భక్తులు, దీక్షపరులు స్వామివారి దర్శనానికి,మాల విరమణ కోసం తరలి రాగా 22 వ తేదీన భక్తుల రద్దీ కొనసాగింది.మాల విరమణ చేసిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని మల్లస్తం అంజన్న సల్లంగ చూడు అంటూ తమ స్వగ్రామలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.






