డబ్బులిస్తే ధాన్యం కేటాయింపులు

by velandi.Saikiran |   (  Updated:2025-11-24 01:01:09  IST  )

ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న సివిల్ సప్లై అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు .

డబ్బులిస్తే ధాన్యం కేటాయింపులు
X

దిశ బ్యూరో, కరీంనగర్ : ప్రభుత్వ ఆదేశాలు, పాలసీలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన సివిల్ సప్లై అధికారులు బేఖాతర్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కొందరు మిల్లర్లకు కొమ్ముకాస్తున్నారు. లక్షల రూపాయలు మామూళ్లు తీసుకుంటూ బ్యాంకు గ్యారెంటీలు లేకపోయినా గతంలో కేటాయించిన ధాన్యం మిల్లుల్లో నిల్వలు లేవంటూ ప్రభుత్వానికి నివేదికలు అందినా అవేమి పట్జించుకోకుండా ధాన్యం కేటాయిస్తున్నారు. అధికారులు కేటాయించిన ధాన్యాన్ని ప్రైవేటుగా విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.ప్రభుత్వానికి ఏళ్ల తరబడి సీఎంఆర్ పెట్టకుండా ఆ సొమ్ముతో కోట్లకు పడగలెత్తుతూ ప్రభుత్వాలకు మాత్రం కుచ్చుటోపి పెడుతున్నారు .

డబ్బులు ఇస్తే ధాన్యం కేటాయింపు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లర్లకు ధాన్యం కేటాయించాల్సిన సివిల్ సప్లై అధికారులు మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుని ధాన్యం కేటాయిస్తున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మిల్లర్లు ఇచ్చే మామూళ్లతో నిబంధనల ప్రకారం ధాన్యానికి సరిపడా బ్యాంకు గ్యారెంటీలు లేకపోయిన ధాన్యం కేటాయిస్తున్నారు. పైగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ప్రయివేటుగా అమ్మి సొమ్ము చేసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నా విజిలెన్స్ అధికారులు సదరు మిల్లుల్లో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలు లేవంటూ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించిన డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నా అధికారులు ఆయా మిల్లుల వద్ద లక్షల రూపాయాలు మామూళ్లు తీసుకుని వారికి ధాన్యం కేటాయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మార్కెట్లో అమ్మి సొమ్ముచేసుకుంటూ సంవత్సరాల తరబడి ఈ అక్రమ దందాను సాగిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటూ ధాన్యం అప్పగించడంతో సివిల్ సప్లై శాఖ కొంతమంది వ్యాపారుల చేతిలో బంది అయి ఏటా కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం కొంతమంది జేబుల్లోకి వెళ్తుంది.

ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్

ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న సివిల్ సప్లై అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు . ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన ధాన్యం నిల్వలు మిల్లుల్లో లేకపోయినా పట్టించుకోకుండా ధాన్యం కేటాయిస్తూ మిల్లర్ల వద్ద లక్షల రూపాయలు కమీషన్ల రూపంలో తీసుకుంటున్నారు. బ్యాంకు గ్యారెంటీలు లేకపోయినా పట్టించుకోకుండా డిపాల్టర్ లకే ధాన్యం అప్పగిస్తున్నారు. దీంతో రైస్ మిల్లర్లు ప్రభుత్వం పంపించిన సీఎంఆర్ తో వ్యాపారాలు చేస్తూ మిల్లుల పేర్లు మార్చి మార్చి దందా సాగిస్తున్నారు. ఇదంత అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుంది అనే విమర్శలు లేకపోలేదు. అయితే అక్రమంగా కోట్లు సంపాదించిన మిల్లర్లు వారికి ఉన్న పలుకుబడితో, రాజకీయనాయకులను మచ్చిక చేసుకుని సివిల్ సప్లై శాఖ కేంద్రం తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్మారు .ఇదంత క్రింది నుంచి పై స్థాయి వరకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఎవరి వాట వారికి ముట్టడంతో ఎన్ని ఫిర్యాదులు వచ్చిన ఎవరు నోరు మెదపడం లేదు అని ఆ శాఖలో బహిరంగా రహస్యమే

పలు మిల్లుల్లో కానరాని ధాన్యం

జిల్లాలోని పలు మిల్లులకు డబ్బులు తీసుకుని ధాన్యం కేటాయించారు అనే ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సివిల్ సప్లై టాస్క్ పోర్స్ అధికారులు 2024-25 ఖరీప్ సీజన్ లో మిల్లులకు కేటాయించి ధాన్యం తనిఖీలు నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 50 శాతం మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేవని అధికారులు గుర్తించినట్టు సమాచారం. అయితే పలు మిల్లులు గతంలో డిపాల్టర్ జాబితాలో ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ధాన్యానికి సరిపడ బ్యాంకు షూరిటీలు లేకపోయినా ఓక్కో మిల్లు వద్ద రూ. 8 లక్షల రూపాయలు లంచం తీసుకుని వారికి ధాన్యం కేటాయించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి

Next Story