- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాక్షేమం కంటే ప్రభుత్వ మొండితనం ఎక్కువైంది : బీజేపీ
హుజురాబాద్ - సిర్సపల్లి శివారులో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకు తీసుకెళ్తున్న డంప్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ - సిర్సపల్లి శివారులో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకు తీసుకెళ్తున్న డంప్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఈ వివాదాస్పద నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ చేపట్టిన పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా బీజేపీ హుజురాబాద్ పట్టణ, మండల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష ఉత్కంఠ భరితంగా సాగింది.
జనావాసాల మధ్య డంప్ యార్డ్ ఏంటి..? : పారుపల్లి కొండల్ రెడ్డి
ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి బీజేపీ మండల అధ్యక్షుడు పారుపల్లి కొండల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి, జనావాసాల మధ్య డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని,ఈ ప్రాంత ప్రజలు ప్రశాంతంగా జీవించే హక్కును ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. సిర్సపల్లి శివారులో డంప్ యార్డ్ వస్తే పరిసర గ్రామాలు వ్యాధుల నిలయంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో హుజురాబాద్ గడ్డపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలరెడ్డి మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ఈ డంప్ యార్డ్ తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కందుగుల సర్పంచ్ ముప్పు మహేష్, కౌన్సిలర్లు పంజాల మనోజ్, కోలుగురి సుమలత, తుర్పాటి లక్ష్మీ దుర్గ తదితరులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ నిరసనలో మాజీ మండల, పట్టణ అధ్యక్షులు రాముల కుమార్, గంగిశెట్టి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, దామర అనురాగ్, రోహిత్, మంచికట్ల మురళి, పడారి సుమన్, చైతన్య రెడ్డి, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, పెరుమళ్ళ దేవా గౌడ్, వాసాల చిరంజీవి, భాష బోయిన శ్రీనివాస్, మోడపు వినయ్, బైరెడ్డి సంపత్ రెడ్డి, పంజాల రాజేష్, యాంసాని శశిధర్, బోరగాల సారయ్య, గోవిందుల భాస్కర్, గంట సంపత్, గొట్టే రవీందర్, క్యాస వెంకటేష్ పాల్గొన్నారు.






