- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలి
మంథని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య డిమాండ్

దిశ,మంథని : మంథని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి లోని అన్ని వార్డులతో పాటు ల్యాబ్, డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంకుల పనితీరును పరిశీలించారు.పేషంట్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అదే విధంగా డాక్టర్లతో మాట్లాడి సమస్యలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ గ్రామాలలో సీజనల్ వ్యాధుల బారిన పడి ప్రజలు పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని పేర్కొన్నారు.
వారికి మెరుగైన వైద్యం అందించాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఆస్పత్రయిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, డయాలసిస్ సెంటర్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లను నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంథనిలో నిర్మాణం జరుగుతున్న ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలనాన్రు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బూడిద గణేష్,ఆర్ల సందీప్, గొర్రెంకల సురేష్, మంథని లింగయ్య, బావు రవి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.






