ఘనంగా మాజీ ప్రధాని పీవీ విగ్రహావిష్కరణ

by velandi.Saikiran |

నరసింహారావు విగ్రహాన్ని హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో ఆదివారం అత్యంత వైభవంగా ఆవిష్కరించారు

ఘనంగా మాజీ ప్రధాని పీవీ విగ్రహావిష్కరణ
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న దివంగత పి.వి. నరసింహారావు విగ్రహాన్ని హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో ఆదివారం అత్యంత వైభవంగా ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ దేశానికి చేసిన సేవలు అజరామరమని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ​​విగ్రహావిష్కరణ అనంతరం పట్టణంలోని హుజురాబాద్ క్లబ్బులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు పాల్గొని ప్రసంగించారు. పీవీ నరసింహారావు కేవలం రాజకీయ నాయకుడే కాదని, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడని కొనియాడారు. కష్టకాలంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, తన చాకచక్యంతో భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన మహనీయుడని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎలగందుల శ్రీనివాస్, మాజీ డైరెక్టర పోల అన్నారెడ్డి, మాధవ రావు, పీవీ సేవా సమితి నాయకులు వెంకట్ రెడ్డి, అలయన్స్ క్లబ్ హుజురాబాద్ అధ్యక్షులు మనోజ్ కుమార్ ,పలువురు రాజకీయ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, పీవీ అభిమానులు, మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. పీవి విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story