- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కోసం ఉదయం నుంచి పడి గాపులు
by Ratna Kumari |
శంకరపట్నం మండలంలో రైతులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

X
దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలో రైతులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓవైపు యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుంటే మరోవైపు షాపులో యూరియా బస్తాలు ఉన్న యాప్ లో నమోదు చేయకపోవడంతో రైతులు షాపు ముందు బారులు తీరారు. కేశవపట్నంలోని సోమేశ్వర ఫెర్టిలైజర్ షాపుకు ఉదయం 220 యూరియా బస్తాలు రాగ సదరు ఫర్టిలైజర్ షాపు యజమాని ,తనకు కంపెనీ నుంచి పాస్ కోడ్ వస్తేనే యూరియా ఇస్తామని చెప్పడంతో రైతులు ఆశగా పొద్దంతా ఎదురు చూశారు. ఓ వైపు యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుంటే షాపు యజమాని పాస్ కోడ్ అని సాకులు చెబుతు కాలం వెళ్లదీశాడని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు యూరియా బస్తాలు లేకుండానే నిరాశతో వెనుదిరిగారు.
Next Story






