పంట దెబ్బ‌తిన్న రైతుల‌ను ఆదుకోవాలి : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి

by Ratna Kumari |

ప్రకృతి వైపరీత్యాల వల్ల‌ మొక్కజొన్న, మామిడి, ఇతర పంటల రైతులను ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

పంట దెబ్బ‌తిన్న రైతుల‌ను ఆదుకోవాలి :  మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి
X

దిశ‌, రాయిక‌ల్ : ప్రకృతి వైపరీత్యాల వల్ల‌ మొక్కజొన్న, మామిడి, ఇతర పంటల రైతులను ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో పర్యటించి ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలులో ఉంటే బాగుండేదని విపత్తులు ఎదురైనపుడు రైతులు నష్టపోకుండా ఉండేదన్నారు. పంటల భీమా అమలు లేకపోవడంతో మనం భీమా కంపెనీతో కూడా ఎటువంటి పరిహారం పొందలేకపోతున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకం అమలు అనేది ఆనవాయితీగా పెట్టుకున్నద‌ని ఆరోపించారు. రైతు భరోసాను రైతు సాగు సమయంలో కోరుకుంటాడు.

ఇష్టం వచ్చినపుడు సాయం ప్రకటించడం సరికాదన్నారు. రైతు భరోసా కోసం ఎకరాకు పైబడి ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 ఉండగా.. మార్కెట్ లో కొందరు 1800 ఇస్తున్నారన్నారు. ఇప్పటికే మార్కెట్ లో మొక్కజొన్న మొత్తం నిండిపోయింది. కొనుగోలు కేంద్రం ప్రారంభించలేద‌ని తెలిపారు. ఇటీవల మంత్రి ఇబ్రహీంపట్నం కేంద్రంలో ప్రారంభించినప్పటికీ తూకం ఆరంభించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ సమగ్ర బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ పథకంలో కుటుంబ పెద్ద చనిపోతే రూ.5ల‌క్ష‌లు ఇస్తారు. తద్వారా కోటి పది లక్షల మంది తెల్ల రేషన్ కార్డు దారులు అర్హత పొందుతారన్నారు. రైతు బీమా ప్రవేశ పెడితే 60 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని సూచించారు. ఈ సమావేశంలోచింతలపల్లి రాజారెడ్డి, భూక్యా రాకేష్ నాయక్, బత్తిని భూమయ్య, గోపి రాజారెడ్డి, గంగాధర్, సంతోష్ , కొయ్యేడి మహిపాల్, ముబీన్ పాల్గొన్నారు.

Next Story