ఇంజనీరింగ్ అధికారుల ఇష్టారాజ్యం.. విలువైన ఫైల్స్, రికార్డ్స్ గాలికి

by Bhanu |

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంజనీరింగ్ అధికారుల ఇష్టారాజ్యం.. విలువైన ఫైల్స్, రికార్డ్స్ గాలికి
X

దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయంలోనే అత్యంత కీలక విభాగమైన ఇంజనీరింగ్ సెక్షన్ లో కార్యాలయ పని వేళల్లో అధికారులు, సిబ్బంది ఎవరు కనిపించకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. దీనికి తోడు కార్యాలయంలో ఆయా పనులకు సంబంధించిన ఫైళ్లు, ఎం.బి రికార్డులన్నీ బయటనే ఉంచడం, గోప్యంగా ఉండాల్సిన రికార్డులన్నీ బెంచీలపైనే ప్రత్యక్షమవ్వడం, అన్నింటికి మించి విలువైన ఫైల్స్ కలిగి ఉండే బీరువా తలుపులు అందరూ చూడగలిగేలా తెరిచి ఉండటంతో కార్యాలయ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉండగా రాజన్న ఆలయంతో పాటు అనుబంధ, దత్తత ఆలయాలలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులు ఉండే కార్యాలయాన్ని ఇలా ఎవరు లేకుండా బహిరంగంగా విడిచి వెళ్లడం ఏంటని...?, అధికారులకు ఇంత నిర్లక్ష్యం ఎందుకనీ...? రాజన్న భక్తులు చర్చించుకుంటున్నారు. గోప్యతపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Next Story