- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు : డి, శ్రీనివాస్
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు నియమితులైన ఎన్నికల వ్యయ పరిశీలకులు డి.శ్రీనివాస్ శుక్రవారం మెట్ పల్లి మున్సిపాలిటీలలో జరుగుతున్న నామినేషన్ ల సరళిని పరిశీలించారు.

దిశ, మెట్ పల్లి : రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు నియమితులైన ఎన్నికల వ్యయ పరిశీలకులు డి.శ్రీనివాస్ శుక్రవారం మెట్ పల్లి మున్సిపాలిటీలలో జరుగుతున్న నామినేషన్ ల సరళిని పరిశీలించారు. అనంతరం డి,శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఎన్నికల నియమావళి మేరకు విధులు నిర్వర్తించాలని అన్ని పత్రాలు నింపడం, సరైనా ధ్రువీకరణ పత్రాలు వంటివి రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలంచాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. పోటీ చేసే అభ్యర్థులు నిర్దేశించిన వ్యయ పరిమితి మేరకు ఖర్చులు చేయాలని అందుకు ప్రత్యేక బ్యాంక్ ఖాతా తీసుకోవాలని ఖర్చులు చేసిన మేరకు బిల్లులు సమర్పించాలని అలాగే పార్టీ పరంగా చేసే వ్యయం, పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థి వ్యయ లను అన్నింటిని నమోదు చేయాలని సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషన్ టి. మోహన్, తహశీల్దార్, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.






