హుజూరాబాద్‌లో డంప్ యార్డ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి : బీజేపీ

by Ratna Kumari |

హుజూరాబాద్ పట్టణంలో ప్రభుత్వం ప్రతిపాదించిన డంప్ యార్డ్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన చేప‌ట్టారు.

హుజూరాబాద్‌లో డంప్ యార్డ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి : బీజేపీ
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ పట్టణంలో ప్రభుత్వం ప్రతిపాదించిన డంప్ యార్డ్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన చేప‌ట్టారు. పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు నాయకత్వంలో అంబేద్కర్ చౌరస్తాలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి త‌హ‌శీల్దార్ కార్యాలయంలో త‌హ‌శీల్దార్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చెత్తనంతటినీ హుజూరాబాద్‌కు తరలించడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. డంప్ యార్డ్ ఏర్పాటు వల్ల గాలి, నీరు కలుషితమై ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలోని విలువైన వ్యవసాయ భూములు కూడా నిరుపయోగంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

​రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి వెంటనే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ మాజీ ఫ్లోర్ లీడర్ పైళ్ల వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు కోలుగురి సుమలత సుమన్, అనురాగ్, రోహిత్, లక్ష్మిదుర్గ, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, యాంసాని శశిధర్, అంకతి వాసు, దామెర అనురాగ్, సర్పంచ్ కందుగుల మహేష్, బోరగాల సారయ్య, పవన్ కుమార్, కురిమిళ్ల శ్రీధర్, మోటపోతుల రాకేష్, ఎర్ర శ్రీధర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story