- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్
సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో అధికారిక బాధ్యతలు స్వీకరించారు.

దిశ, గోదావరిఖని : సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో అధికారిక బాధ్యతలు స్వీకరించారు. గురువారం సింగరేణి భవన్ కు విచ్చేసిన ఆయనకు సంస్థ జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్, మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఛైర్మన్ కార్యాలయంలో అధికారిక బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్. వి సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) గౌతం పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్ మెంట్) బి. వెంకన్న ఛైర్మన్ కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ 2002 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇప్పటివరకు ఆయన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పని చేశారు. గతంలో రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శిగా సేవలు అందించారు. అంతకుముందు సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో కూడా వివిధ హోదాల్లో పని చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, భద్రాచలం ఐటీడీఏ పీఓగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సీనియర్ అధికారిగా పేరున్న డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ సింగరేణి సంస్థ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.






