ప్రజా మరుగుదొడ్ల కు 'డోరు' కరువు?

by Ratna Kumari |

అటు ఉద్యోగాల్లో.. ఇటు వ్యాపారాల్లో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు కొన్నిసందర్భాల్లో సమస్యలు ఎదు ర్కోవాల్సి వస్తోంది.

ప్రజా మరుగుదొడ్ల కు డోరు  కరువు?
X

దిశ, గంభీరావుపేట : అటు ఉద్యోగాల్లో.. ఇటు వ్యాపారాల్లో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు కొన్నిసందర్భాల్లో సమస్యలు ఎదు ర్కోవాల్సి వస్తోంది. ప్రధానంగా ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో లేక వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ని మేజర్‌ గ్రామపంచాయతీల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామ పంచాయతీలు బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జణ రహిత గ్రామాలుగా ప్రకటించుకున్నాయి. ఈ మండల కేంద్రంలో ఇంటింటికీ మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకున్నారు. కానీ మండల కేంద్రంతోపాటు గ్రామాలకు వచ్చిపోయే వారికి బహిరంగ మరుగుదొడ్లు లేక మలమూత్ర విసర్జనకు ఇబ్బంది పడుతున్నారు. 20 రోజుల క్రితం గ్రామసభలో కూడా ప్రజలు మహిళలలు ఇబ్బంది పడుతున్నారని అటు పాలకవర్గానికి అధికారులకు చెప్పిన‌ప్ప‌టికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. బాత్రూం డోర్ విరిగిపోయి చాలా నెలలు అవుతున్నా కానీ దాని అధికారి కానీ అటు పాలకవర్గం కానీ బాత్రూం డోర్ చేయలేని పరిస్థితి ప్రజల నుంచి వచ్చిన ఇంటి పన్ను ఇతర పన్నులు ఆదాయం ఎటు వెళ్లిపోతుందని ప్రజలు ముక్కున వెలుసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకవర్గం స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయాలని మహిళలు కోరుతున్నారు.

Next Story