గ్రామాల్లో తాగునీటి సమస్య రానివ్వొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్

by Ratna Kumari |

గ్రామాల్లో తాగునీటి సమస్య రానివ్వొద్దు అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు.

గ్రామాల్లో తాగునీటి సమస్య రానివ్వొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, హుజూరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వేసవి కాలంలో తాగునీటి సమస్యలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా అధికారులతో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు, ధాన్యం తరలింపున‌కు వాహనాల ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, బార్థన్ ఇబ్బందులు, ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే పేమెంట్ జరిగేలా చర్చలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఇళ్లు పూర్తయిన వారు గృహ ప్రవేశాలు కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి , డీఆర్డీవో శ్రీధర్ , ఆర్డీవో రమేష్ బాబు, తహశీల్దార్ గుర్రం శ్రీనివాస్, ఎంపీడీవో యాదగిరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story