- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులను మోసం చేయవద్దు.. ఎమ్మెల్యే సతీష్ ను కోరిన కాంగ్రెస్ నేతలు
రైతులను మోసం చేయవద్దని, రైతులు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను కోరారు.

X
దిశ, చిగురుమామిడి : రైతులను మోసం చేయవద్దని, రైతులు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను కోరారు. మంగళవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ చిగురుమామిడి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. కాగా, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నవాబుపేట గ్రామంలో ఎమ్మెల్యే సతీష్ ను కలసి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బాగుంటేనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులుగా తయారవుతారని తెలిపారు. ఓట్ల కోసం నటించకుండా రైతులకు పారదర్శకంగా సేవలందించాలన్నారు. రైతుల అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు.
Next Story






