- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో లబ్ధిదారులు సుముఖంగా లేకపోతే పేరు తొలగించండి !
పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం

దిశ. హుస్నాబాద్ : పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీవో రామ్మూర్తి తో కలిసి నిర్వహించారు. ఈ సమీక్ష లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...పంచాయతీ రాజ్ ఇంజనీర్ శాఖలో ఏంజిఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడి సెంటర్స్ పనులు మొదలు పెట్టినవి పూర్తి చెయ్యాలని, మిగతా పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
అలాగే కట్టడానికి స్థలం లేక జిపి, అంగన్వాడి భవనాలకు కట్టలేకపోతున్నామని అధికారులు తెలపగా ఎంపీడీవో, తహసీల్దార్ ఫీల్డ్ ఎంక్వైరీ చెయ్యాలని ఆదేశించారు. అలాగే పీ హెచ్ సి, సబ్ సెంటర్ ల నిర్మాణం, మరియు మేజర్, మైనర్ రిపేర్లు సైతం వేగంగా పూర్తి చేయాలన్నారు.కోహెడ నుండి సముద్రాల పూర్తి కావచ్చిందని 15 రోజుల్లో అర్ అండ్ బి శాఖ అధికారులు పూర్తి చెయ్యాలని. జిఎస్బి, రెడ్ మిక్స్, బిటి, కల్వర్టు పనులు, అంతక్కపేట నుండి కొత్తకొండ రోడ్ సైతం వేగం పెంచాలని తెలిపారు. హుస్నాబాద్ నుండి కొత్తపల్లి 4 వరసల రోడ్ పనులకు ఇంజనీర్ అధికారులు టోకెన్ రేజ్ చెయ్యాలని, ఎలక్ట్రికల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు ఇవ్వగానే పనులు మొదలు పెట్టాలని తెలిపారు. ఎలక్ట్రిసిటీ స్తంభాలు, చెట్లు తొలగించడంలో టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి మొదలు పెట్టాలని తెలిపారు. నేషనల్ హైవే పనుల్లో పోతారం, పందిళ్ల, జిల్లెళ్ళగడ్డ, సముద్రాల, బస్వాపూర్ గ్రామాల వద్ద సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చెయ్యాలని తెలిపారు. హుస్నాబాద్ టౌన్ లో 4 వరసల రోడ్ పనులు దాదాపు పూర్తి కావచ్చిందని అధికారులు తెలుపగా మిగతా ప్రదేశాల్లో ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ లో వేగం పెంచాలని రోడ్ పనులు పూర్తి చెయ్యాలని అన్నారు.
మిషన్ భగీరథ మండలాల్లో తాగు నీరు అందించే పనులు సైతం చేపట్టిన పనులు పూర్తి చెయ్యాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ మున్సిపల్ లో సిసి రోడ్స్, డ్రైనేజీ, పనులు, పందిళ్ల నుండి ఎల్లమ్మ చెరువు వరకు బిటి రోడ్ నిర్మాణం, రీడింగ్ రూమ్, కమ్యూనిటీ హాల్, ఇతరత్ర పనులలో వేగం పెంచాలని, ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులు, బతుకమ్మ ఘాట్ ను బతుకమ్మ పండుగ వరకు పూర్తి చెయ్యాలని మిగిలిన పనులు నిర్ణీత కాల వ్యవధిలోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మండలాల్లో చెరువులను ఎల్లపుడు మానిటర్ చెయ్యాలని కట్ట నాణ్యత చెక్ చెయ్యాలని నీటిపారుదల శాఖ అధికారులకు తెలిపారు. కొత్తగా నిర్మించే ఆసుపత్రి భవనం ప్లాన్ ను పక్కా ప్రణాళికతో నిర్మాణం జరగాలని ఇంజినీరింగ్ అధికారులకు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ అయిన లబ్ధిదారులు వేగంగా నిర్మాణం పూర్తి చేయాలని,నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఆయా స్థాయిలో ఏఈ హౌసింగ్ విసిట్ చేసి పేమెంట్ త్వరగా వచ్చేలా చూడాలని తెలిపారు. నిర్మాణం సుముఖంగా లేని వారి నుండి లేటర్ తీసుకుని పేరు తొలగించాలని, పి ఎం ఏ వై యాప్ లో శాంక్షన్ అయిన వాటిని అప్లోడింగ్ ప్రక్రియ సైతం పూర్తి చెయ్యాలనీ ఎంపిడిఓ మరియు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
వనమహోత్సవ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు సిఏ బ్లాక్ ప్రాంతాల్లో ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చెయ్యాలని వీఐపి ప్లాంటేషన్, ఇతర మొక్కలను ఎల్లపుడు మానిటర్ చెయ్యాలని తెలిపారు. విద్యా సంస్థలు, రోడ్ వెంబడి, హెల్త్ సెంటర్ లలో మొక్కలు లక్ష్యం ప్రకారం పూర్తి చెయ్యాలని వనమహోత్సవం లో భాగంగా రోడ్ కి ఇరువైపుల చెట్లు నాటే కార్యక్రమం ఆయా శాఖల అధికారులు సైతం వేగం పెంచాలని తెలిపారు.మున్సిపల్ లో వనమహోత్సవం టార్గెట్ సైతం పూర్తి చెయ్యాలని,రోడ్ వెంబడి రావి, మర్రి, వేప లాంటి చెట్లు పెంచాలని ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి కాగానే తులసి, మునగ, జామ, కరువే పాకు, నిమ్మ చెట్లు పంపిణీ చేయాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాల సంబంధించి విద్యార్థులకు హాస్టల్ వసతి గురించి బాయ్స్, గర్ల్స్ కు గవర్నమెంట్ హాస్టల్ అందించే ప్రక్రియ గూర్చి అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






