- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. కాసింపేట్ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత సస్పెన్షన్
ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడుతూ, నిధులను దుర్వినియోగం చేస్తున్న ఆరోపణల మేరకు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ జక్కనపల్లి శ్రీలత పై వేటు పడింది.

దిశ, గన్నేరువరం : ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడుతూ, నిధులను దుర్వినియోగం చేస్తున్న ఆరోపణల మేరకు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ జక్కనపల్లి శ్రీలత పై వేటు పడింది. ఆమె పై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారణలో నిజమని తెలియడంతో కరీంనగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి( డీఆర్డీఓ) ఎం. గీత ఆమెను విధుల్లో నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ బుధవారం ఒక సంచలన ఉత్తర్వు జారీ చేశారు. విచారణలో దుబాయ్ వెళ్లిన అతనికి పని కల్పించినట్లు, ఉపాధి హామీ కూలీలను సొంత పనులకు వినియోగించుకున్నట్లు, 100 రోజుల పని దినాలు నిండిన వారికి నిబంధనలకు విరుద్ధంగా వేరే జాబ్ కార్డు పై పనులు కల్పించడం, పనికిరాని వారికి హాజరులు వేయడం, తాను స్వయంగా మూడు జాబ్ కార్డు కలిగి ఉండి చట్టాన్ని ఉల్లంఘించినట్లు తెలిపారు.
రికవరీ నోటీసులు క్రిమినల్ చర్యలకు ఆదేశం
నిబంధనలను తుంగలో తొక్కి విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గాను శ్రీలతను సస్పెండ్ చేయడమే కాకుండా దుర్వినియోగం చేసిన మొత్తాన్ని ఆమంచి రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ఆర్డర్ అందిన 14 రోజుల్లో ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ జారీ చేశారు. తక్షణమే ఆమె వద్ద ఉన్న సిమ్ కార్డు, రికార్డులను స్వాధీనం చేసుకోవాలని మండల ఎంపీడీవో కు జిల్లా అధికారి ఆదేశించారు.






