దిశ ఎఫెక్ట్.. ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో ఆక‌స్మిక‌ త‌నిఖీ

by Ratna Kumari |

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను, స్కానింగ్ సెంటర్లను డిప్యూటీ (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ ఎఫెక్ట్.. ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో ఆక‌స్మిక‌ త‌నిఖీ
X

దిశ, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను, స్కానింగ్ సెంటర్లను డిప్యూటీ (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 'ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం బహిర్గతం' స్పెషలిస్ట్ లేకుండానే ఎండోస్కోపీ' అనే శీర్షికను మార్చి 01న‌ దిశ పత్రిక ప్రచురించింది. దీంతో స్పందించిన వైద్యాధికారులు బుధవారం మెట్ పల్లి లోని పలు ఆసుప‌త్రుల‌పై ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా డిప్యూటీ (డీఎంహెచ్ఓ) డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని సూర్య ఈఎన్టీ ఆసుపత్రి నిబంధనలు అతిక్రమించారని.. అందుకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. తదుపరి విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని అతిక్రమించిన వారిపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.


రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన డాక్టర్ల ద్వారానే వైద్య సేవలు అందించాలని, కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లలో ఆడిషన్ చేశాకే వారి సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. స్కానింగ్ సెంటర్లలో స్కానింగ్ మిషన్స్, డాక్టర్ల అర్హత ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకున్న విధంగానే ఉన్నాయా లేదా అనే విషయాలను నిర్ధారించుకున్నారు. ఫారం ఎఫ్ లు ప్రతి నెల 5వ తేదీ లోపు వారికి కేటాయించబడిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలలో సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశించారు. ఫారం ఎఫ్ లు ఆన్లైన్లో, ఆఫ్ లైన్ లో ఒకే విధంగా ఉండాలన్నారు. లింగ నిర్ధారణ చేసేటప్పుడు పేషంట్లకు కనపడే విధంగా 'ఇక్కడ లింగ నిర్ధారణ చేయబడదు' - 'లింగ నిర్ధారణ చేసినచో కఠిన చర్యలు తీసుకోబడతాయి' అనే ఫ్లెక్సీ బోర్డులు, ఫోం బోర్డులు ఏర్పాటు చేయాల‌ని డాక్టర్ జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించి లింగ నిర్ధారణ చేసినచో జరిమానా విధించబడడమే కాకుండా గర్భిణీ మినహా ప్రోత్సహించిన వారిపై కూడా జరిమానా మూడు నెలల జైలు శిక్ష కూడా ఉంటుందని, వైద్యుల రిజిస్ట్రేషన్ కూడా రద్దుపరుచబడతాయని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి నోటీసులు జారీ చేయబడతాయి. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ తరాల శంకర్,ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాజేశం పాల్గొన్నారు.

Next Story