భక్త జనసంద్రమైన కోటిలింగాల

by velandi.Saikiran |

కార్తీక పౌర్ణమి నేప‌థ్యంలో వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కోటిలింగాల జన సంద్రమైంది.

భక్త జనసంద్రమైన కోటిలింగాల
X

దిశ, వెల్గటూర్ : కార్తీక పౌర్ణమి నేప‌థ్యంలో వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కోటిలింగాల జన సంద్రమైంది. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో కోటేశ్వర స్వామి ఆలయం కిటకిటలాడింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టి మొక్కులు చెల్లించు కున్నారు. అనంతరం గోదావరిలో కార్తీక దీపాలను వదిలేశారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొనుగోటీ మంజుల శ్రీనివాసరావు దంపతులు కోటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా ప్రత్యేకపూజలు చేశారు. అర్చకులు కార్తీక్ అన్వేష్, నాగరాజు సంజీవ్ లు తీర్థ ప్రసాదాలు అంద చేసి ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాంత రెడ్డి చైర్మన్ పూదరి రమేష్, సుగ్రీవ రావు నూనె శ్రీనివాస్ రామస్వామి తిరుపతి జాడి రాజేశం శేఖర్ కోటయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story