- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ,మంథని : మంథని మండలం అడవి సోమన్ పల్లి గ్రామం వద్ద ఉన్న మానేరు బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉంది. బ్రిడ్జి మీద అక్కడక్కడ గుంతలు పడ్డాయి. ఇనుప కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయి. దాంతో వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఈ బ్రిడ్జిని నిర్మించి దాదాపు 50 సం.ల పైగా అవుతుంది. మంథని నియోజకవర్గం కొన్ని మండలాలు మానేరు అవతలి వైపు, కొన్ని మండలాలు ఇవతలి వైపు ఉన్నాయి. ఈ బ్రిడ్జి మంథని నుండి కాటారం భూపాలపల్లి, వరంగల్, కాళేశ్వరం మహారాష్ట్ర లకు కాటారం నుండి వచ్చే ప్రయాణికులకు దూర భారం తగ్గడానికి ఉపయోగపడుతుంది. కొద్దీ రోజుల నుండి ఓవర్ లోడ్ వాహనాలు ప్రయాణించడంతో బ్రిడ్జి మీద గుంతలు ఏర్పడ్డాయి. ప్రమాదం జరగక ముందే సంబంధిత అధికారులు బ్రిడ్జి మీద మారమ్మత్తులు చేపట్టాలని ప్రయాణికులు,వాహనదారులు స్థానిక ప్రజలు వాపోతున్నారు.
Next Story






