కోతుల కోసం పెట్టిన క‌రెంట్ షాక్.. రైతుకు ప్ర‌మాదం..!

by Ratna Kumari |

కోతుల భారీ నుంచి చేను కాపాడుకోవ‌డానికి రైతు క‌రెంట్ షాక్ పెట్టాడు. ప‌క్క చేనుకు సంబంధించి మ‌రో రైతు కి క‌రెంట్ షాక్ కొట్టి తృటిలో త‌ప్పించుకున్నాడు.

కోతుల కోసం పెట్టిన క‌రెంట్ షాక్.. రైతుకు ప్ర‌మాదం..!
X

దిశ‌, ఎల్లారెడ్డిపేట : కోతుల భారీ నుంచి చేను కాపాడుకోవ‌డానికి రైతు క‌రెంట్ షాక్ పెట్టాడు. ప‌క్క చేనుకు సంబంధించి మ‌రో రైతు కి క‌రెంట్ షాక్ కొట్టి తృటిలో త‌ప్పించుకున్నాడు. ఈ ఘ‌ట‌న బండ‌లింగంప‌ల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బండ‌లింగంప‌ల్లి గ్రామ శివారులోని గుండం శ్రీనివాస్ రెడ్డికి చెందిన వరి పంట‌ను కోతుల భారీ నుంచి కాపాడుకోవ‌డం కోసం చేను చుట్టూ శుక్ర‌వారం క‌రెంట్ షాక్ పెట్టి హ్యాపీగా ఊరెళ్లాడు. ప‌క్క చేనుకు సంబంధించిన రైతు జంగ భాస్క‌ర్ రెడ్డి త‌న పాడి గేదెల‌కు గ‌డ్డి కొనుక్కుందామ‌ని వెళ్లాడు. క‌రెంట్ షాక్ త‌గ‌ల‌డంతో తృటిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

అప్ప‌టికే ఆయ‌న కాళ్లు, చేతుల‌తో ప్ర‌మాదానికి గుర‌య్యాడు. వెంట‌నే చుట్టు ప‌క్క‌ల రైతులు సిరిసిల్ల‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం జంగ భాస్క‌ర్ రెడ్డి చికిత్స పొందుతున్నాడు. ఒక వైపు పోలీసులు, మ‌రోవైపు విద్యుత్ అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నా అడ‌వి జంతువుల నుంచి పంట‌ల‌ను కాపాడుకోవ‌డం కోసం అంటూ రైతులు మానేరు వాగులో వాగు పొడ‌వునా మ‌ల్లారెడ్డి పేట నుంచి మొద‌లు బ్రిడ్జీ వ‌ర‌కు అక్క‌డిక‌క్క‌డ క‌రెంట్ షాకులు పెడుతుండ‌టంతో అమాయ‌క ప్ర‌జ‌లు చాలా మంది మ‌ర‌ణిస్తున్నారు. పోలీసులు, విద్యుత్ అధికారులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటే క‌రెంట్ షాక్ మ‌ర‌ణాలు త‌గ్గే అవ‌కాశాలు లేక‌పోలేదు.

Next Story