సంతాన సాఫ‌ల్య కేంద్రాల ఫెర్టిలిటీ సెంట‌ర్లు నిర్వాహ‌కుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాలి

by Ratna Kumari |

జిల్లా కేంద్రంలోని గుర్తింపులేని సంతాన సాఫల్యకేంద్రాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చారు ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భావనలపల్లి యుగంధర్.

సంతాన సాఫ‌ల్య కేంద్రాల ఫెర్టిలిటీ సెంట‌ర్లు నిర్వాహ‌కుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాలి
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని గుర్తింపులేని సంతాన సాఫల్యకేంద్రాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చారు ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భావనలపల్లి యుగంధర్. అఖిలభారత యువజన సమైక్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సహాయ కార్యదర్శి భావండ్లపల్లి యుగంధర్ మాట్లాడుతూ.. సంతాన భాగ్యం కోసం ఎన్నో కలలు కంటున్నా దంపతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని, అమానూషమైన పద్ధతుల్లో వీర్యం, అండాలను సేకరించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నార‌ని తెలిపారు. వికృత దందా సంతాన సఫల్యా కేంద్రాల నిర్వాహకులు చేస్తున్న దిగ్భంధికార వాస్త‌వాల‌ను సంబంధిత బాధితులు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇటీవల ఫెర్టి 9 మోసాలు జిల్లాలో ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయన్నారు.


సంతాన భాగ్యం కలగని దంపతులను టార్గెట్ చేసుకొని విచ్చలవిడిగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వీర్యాన్ని సేకరించి సంతాన భాగ్యం కల్పిస్తామంటూ ఐవీఎఫ్- ఐయుఐ ద్వారా సంతానలేమి సమస్యకు చెక్ పెడతామని సామాజిక మాధ్యమాలలో పత్రికలలో లక్షల రూపాయలు వెచ్చించి యాడ్ ఇస్తూ అమాయకుల ఆశలను ఆసరాగా చేసుకుని ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారన్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఫెర్టిలిటీ దందాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపాలన్నారు. ఎటువంటి అనుమతులు లేకున్నా జిల్లాలో విచ్ఛ‌లవిడిగా ఫెర్టిలిటీ హాస్పిటల్స్ నెలకొల్పబడుతున్నాయన్నారు. గతంలో బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేసిన సంఘటనలు అనేకం జిల్లా కేంద్రంలో ఉన్నాయన్నారు. ఇకనైనా ఫెర్టిలిటీ సెంటర్ల పై కలెక్టర్ దృష్టిచారించి విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి చెంచాల మురళి రమేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story