బ‌క్రిద్ వేళ‌.. స‌రికొత్త ప్ర‌తిపాద‌న

by Ratna Kumari |

దేశంలో ఆవు అంశం పై జ‌రుగుతున్న రాజ‌కీయ మ‌త వివాదాల‌కు ముగింపు ప‌ల‌కాలంటే ఆవును అధికారికంగా జాతీయ జంతువుగా ప్ర‌క‌టించాల‌ని సిరిసిల్ల ఇంథిజామి మ‌సీద్ క‌మిటీ నేత‌లు కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు.

బ‌క్రిద్ వేళ‌.. స‌రికొత్త ప్ర‌తిపాద‌న
X

దిశ ప్ర‌తినిధి, రాజ‌న్న సిరిసిల్ల : బ‌క్రిద్ పండుగ వేళ సిరిసిల్ల‌లో ముస్లిం సంఘాలు వినూత్న డిమాండ్ ను ముందుకు తీసుకొచ్చాయి. దేశంలో ఆవు అంశం పై జ‌రుగుతున్న రాజ‌కీయ మ‌త వివాదాల‌కు ముగింపు ప‌ల‌కాలంటే ఆవును అధికారికంగా జాతీయ జంతువుగా ప్ర‌క‌టించాల‌ని సిరిసిల్ల ఇంథిజామి మ‌సీద్ క‌మిటీ నేత‌లు కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. బక్రీద్ వేడుక‌ల్లో పాల్గొన్న ముస్లిం సంఘం నేత‌లు మీడియాతో మాట్లాడారు. కొన్ని రాజ‌కీయ, మ‌త‌త‌త్వ శ‌క్తులు కావాల‌నే ఆవు అంశాన్ని ఉప‌యోగించి దేశంలో అల‌జ‌డి సృష్టిస్తున్నాయ‌ని ఆరోపించారు. ఆవుకు జాతీయ హోదా క‌ల్పిస్తే.. దానిని కొనుగోలు చేయ‌డం, అమ్మ‌డం లేదా వ‌ధించ‌డం చ‌ట్ట‌రిత్యా నేరంగా మారుతుంద‌ని తెలిపారు. దీంతో ఈ అంశం పై రాజ‌కీయ లేదా మ‌త‌ప‌ర‌మైన ల‌బ్దిపొందే అవ‌కాశాలు త‌గ్గిపోతాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్ప‌టికే త‌మ మ‌త పెద్ద‌లు ఆవును వ‌ధించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని క‌మిటీ స‌భ్యులు పేర్కొన్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు.

Next Story