కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్లకే చైర్ ప‌ర్స‌న్ గా అవకాశం ఇవ్వాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

by Ratna Kumari |

కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు చైర్ ప‌ర్స‌న్ గా అవకాశం ఇవ్వాలని, అవకాశ వాదులకు ఇవ్వొద్దని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు.

కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్లకే  చైర్ ప‌ర్స‌న్  గా  అవకాశం ఇవ్వాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల టౌన్ : కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు చైర్ ప‌ర్స‌న్ గా అవకాశం ఇవ్వాలని, అవకాశ వాదులకు ఇవ్వొద్దని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే సంజయ్ నుంచి స్వేచ్ఛను ప్రసాదించాలని అధిష్టానాన్ని కోరారు. కురు సామ్రాజ్య పతనానికి శకుని పోషించిన పాత్రలా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఎమ్మెల్యే కారణమయ్యారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బలపరిచిన రాయికల్ మున్సిపల్ లో 8 స్థానాల్లో పోటీ చేస్తే.. ఒక్కటి గెలిచారని, మేము మూడు స్థానాల్లో పోటీ చేస్తే రెండు గెలుచుకున్నామన్నారు. ఎమ్మెల్యే సూచనలు, సలహాలతో బీ ఫామ్ పంపిణీ లో నేడు స్వతంత్రుల పై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అయినా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేస్తామ‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచి ప్రచారం చేయాల్సి వచ్చిందని, మేము సూచించిన అభ్యర్థులకు ప్రచారం చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తలను ఓడించడానికి ఎమ్మెల్యే ప్రచారం చేశారని, నేడు గెలిచిన అభ్యర్థులను లోబర్చుకోవాలని ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయి ఉండి విప్ న‌కు అనుగుణంగా ఓటు వేస్తామని చెబుతున్నాడని కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని పేర్కొన్నారు. స్వతంత్రులకు నేను తోడుగా నిలుస్తానని కాంగ్రెస్ పార్టీ నీ వదిలే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

Next Story