- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులను పొట్టన పెట్టుకుంటున్న కాంగ్రెస్
శంకరపట్నం మండలంలోని గద్దపాక గ్రామంలో వడ్ల కుప్పపై గుండెపోటుతో ప్రాణాలు విడిచిన రైతు కొయ్యడ ఐలయ్య మరణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రసమయి నిప్పులు చెరిగారు.

దిశ, శంకరపట్నం : శంకపట్నం మండలంలోని గద్దపాక గ్రామంలో వడ్ల కుప్పపై గుండెపోటుతో ప్రాణాలు విడిచిన రైతు కొయ్యడ ఐలయ్య మరణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రసమయి నిప్పులు చెరిగారు. స్వగ్రామం గద్దపాకలో జరిగిన రైతు అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై పాడే మోసారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ రైతు కోయడ ఐలయ్య మృతికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం తప్ప ధాన్యం కాంటాలు జరుగుతున్నాయా? లేదా? రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు? అనే విషయాన్ని మర్చిపోయారన్నారు. ధాన్యాన్ని కాపాడుకునే క్రమంలో ఓ రైతు మృతి చెందడం బాధాకరమన్నారు.
మృతి చెందిన రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా అందించాలన్నారు. కోతలు కోసి కల్లాల్లో 20 రోజులుగా ఎదురుచూస్తున్న రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతుల బ్రతుకులు బుగ్గిపాలవుతున్నాయని.. ఎండకు, వానకు ఓర్చి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే ధాన్యం కొనే దిక్కులేక గుండె బరువెక్కి రైతన్నలు మరణిస్తున్నారని అన్నారు. కొయ్యడ ఐలయ్య అనే రైతు వరికోసిన ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో వడ్ల కుప్పపైనే గుండెపోటుతో మరణించారని అన్నారు. ఏ గ్రామంలో చూసిన ధాన్యం తూకం వేయకుండా ఎక్కడి ధాన్యం అక్కడే పెరుకు పోయిందని.. ఒక వేళ తూకం వేసిన లారీలు రాక మిల్లులు అలాట్ మెంట్ లేక ధాన్యం బస్తాలు ఎక్కడివి అక్కడే ఉంటున్నాయన్నారు. ధాన్యం తూకాలు వేగవంతంగా చేసి లారీలతో ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద మొత్తంలో రైతులతో కలిసి ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.






