- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు తోడుదొంగలు
"నన్ను నువ్వు రక్షించు, నేను నిన్ను రక్షిస్తా" అన్న రహస్య ఒప్పందం కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : "నన్ను నువ్వు రక్షించు, నేను నిన్ను రక్షిస్తా" అన్న రహస్య ఒప్పందం కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం జగిత్యాల పట్టణంలో బిజెపి విజయశంకరామం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాంచందర్ రావు తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త కొండ లక్ష్మణ్ దంపతులతో పాటు పలువురు నాయకులు బిజెపిలో చేరారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని, ప్రజల జీవితాలు బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయాల్సిందేనని పిలుపునిచ్చారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. సిగ్గులేని సీఎం రేవంత్ రెడ్డి అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.కేసీఆర్‌ను 100 రోజుల్లో జైలుకు పంపిస్తానన్న సీఎం రేవంత్ మాటలు గాలిలో కలిసిపోయాయని ఎద్దేవా చేశారు. జగిత్యాల రాజకీయాల్లో తీవ్ర గందరగోళం నెలకొందని వ్యాఖ్యానించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీకి చెందినవాడో తనకే తెలియడం లేదని వ్యంగ్యంగా అన్నారు. ఈ చిక్కుముడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావే తేల్చాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీకి ఓటు అడుగుతాడో ప్రజలే గమనించాలని సూచించారు. రేవంత్ రెడ్డి జగిత్యాలకు వచ్చినప్పుడు సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడు ప్రజలే అడగాలన్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే జగిత్యాలకే ఎక్కువ కేంద్రం నిధులు వచ్చాయన్నారు. అనుభవజ్ఞుడైన జీవన్ రెడ్డి గాంధీ భవన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమన్నారు. తాము కార్యకర్తలమేగానీ దళారులు కాదని స్పష్టం చేస్తూ, జగిత్యాలలో బీజేపీకి ఓటు వేసి మార్పుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు.






