మానకొండూరు పోలీసుల తీరుపై ఫిర్యాదులు

by velandi.Saikiran |

మానకొండూరు మండలం అన్నారం గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద పోలీసులు చేపట్టిన వెహికిల్ చెకింగ్, డ్రంక్ అండ్

మానకొండూరు పోలీసుల తీరుపై ఫిర్యాదులు
X

దిశ,మానకొండూరు: మానకొండూరు మండలం అన్నారం గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద పోలీసులు చేపట్టిన వెహికిల్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల తీరుపై స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హెడ్ కానిస్టేబుల్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జ‌రిగాయి. ఈ తరుణంలోనే పోలీసుల ప్రవర్తన, నిబంధనల అమలులో చూపిన వివక్ష పట్ల పలువురు అసంతృప్తి చెందారు.

సామాన్యులపైనే ప్రతాపం?

వాహనాల పత్రాలు లేని వారిని, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వారిని తనిఖీ చేశారు. అయితే, తనిఖీలు కేవలం సామాన్య ప్రయాణికులకే పరిమితమయ్యాయని స్థానికులు ఆరోపించారు. ముఖ్యంగా, ప్రయాణికుల పట్ల హెడ్ కానిస్టేబుల్ వెంకట్ స్వామి మాట్లాడిన తీరు సరిగా లేదని, వల్గర్ పదజాలం ఉపయోగించి బెదిరించారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవంగా సంబోధించినా, ఆగ్రహం వ్యక్తం చేసి 'సార్' అని పిలవాలంటూ బెదిరించారని ప్రయాణికులు తెలిపారు.

ఇసుక లారీలకు మినహాయింపు, రైతు ట్రాక్టర్ల తనిఖీ?

ఈ తనిఖీల్లో ఇసుక లారీలను పోలీసులు ఆపకపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీని గురించి ప్రశ్నించగా, 'వాటిని ఆపే అధికారం లేదు' అని ఒకరు, 'ఊటూర్లో చెక్ చేస్తున్నారు' అని మరొకరు పొంతన లేని సమాధానాలు చెప్పి లారీలను పంపించేశారని స్థానికులు చెబుతున్నారు.

Next Story