- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొడ్రాయి వివాదం.. అంబేద్కర్ విగ్రహం పక్కనే ఏర్పాటు
బొడ్రాయి పున:ప్రతిష్ట పేరుతో చందాలు వసూల్ చేసి తీరా డబ్బులు పోగు అయ్యాక నూతన బొడ్రాయి ప్రతిష్టిస్తామనడం కరీంనగర్ జిల్లా మానకోండూర్ మండలం ఊటూర్ గ్రామంలో వివాదస్పదంగా మారింది.

దిశ, మానకొండూర్ : బొడ్రాయి పున:ప్రతిష్ట పేరుతో చందాలు వసూల్ చేసి తీరా డబ్బులు పోగు అయ్యాక నూతన బొడ్రాయి ప్రతిష్టిస్తామనడం కరీంనగర్ జిల్లా మానకోండూర్ మండలం ఊటూర్ గ్రామంలో వివాదస్పదంగా మారింది. నూతన బొడ్రాయి ఏర్పాటును కొంతమంది గ్రామస్తులు వ్యతిరేకిస్తుండగా బొడ్రాయిని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆనుకుని ఏర్పాటు చేయడాన్ని దళితులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామస్తులు, దళితులు బొడ్రాయి పండుగను వ్యతిరేకిస్తున్నప్పటికి పరిగణలోకి తీసుకుని ఓ వర్గం బొడ్రాయి ఏర్పాటు పనులను వేగవంతం చేయడంతో బొడ్రాయి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారు ప్రజావాణిలో కలెక్టరుకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికి బొడ్రాయిని ఏర్పాటు చేసి తీరుతామంటూ ఓ వర్గం నిర్మాణ పనులను చేపట్టడం పంతం నెగ్గించుకునేందుకు రాజకీయ పలుకుబడిని ఉపయోగించడం జిల్లా వ్యాప్తంగా చర్చానీయంశంగా మారింది. ఒకే గ్రామంలో ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి పంతాలకు పోవడం శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం లేకపోలేదు అనే చర్చ జోరందుకుంది.






