పోతిరెడ్డిపేటలో రక్తదాన శిబిరం

by Elthuri vijay kumar |

హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామంలో చందుపట్ల వెంకటేష్ స్మారకార్థం ఘనంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

పోతిరెడ్డిపేటలో రక్తదాన శిబిరం
X

పోతిరెడ్డిపేటలో రక్తదాన శిబిరం

చందుపట్ల వెంకటేష్ స్మారకార్థం ఏర్పాటు చేసిన వీడీసీ

దిశ,హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామంలో చందుపట్ల వెంకటేష్ స్మారకార్థం ఘనంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆలయ ఫౌండేషన్ సౌజన్యంతో గ్రామ అభివృద్ధి కమిటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ శిబిరాన్ని హుజూరాబాద్ టౌన్ సీఐ టీ. కరుణాకర్ మరియు డాక్టర్ తొగరు విద్యాసాగర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా టౌన్ సీఐ టీ. కరుణాకర్ మాట్లాడుతూ.. రక్తదానం అన్ని దానాల కంటే గొప్పదని, ఒక రక్తపు చుక్క అనేక ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ అభివృద్ధి కమిటీని, ఆలయ ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు. "రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి" అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు తొగరు విద్యాసాగర్ ,చందుపట్ల వెంకటేష్ తండ్రి, తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ కూడా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గ్రామ తరంగ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో రక్తదానం చేసిన దాతలకు ప్రధానమంత్రి సురక్ష బీమా కింద రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ కల్పించడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవునూరి కిరణ్, కంకణాల పరశురాములు పర్యవేక్షించారు. మాజీ సర్పంచ్ చందుపట్ల పరంధాములు, ఆవుల రమేష్, దేవునూరి బాబు, నందిపేట పరమేశ్వర్, బండ అజయ్, మంతెన సురేందర్, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story