తెలంగాణకు రు 12 లక్షల కోట్ల ఇచ్చాం : బండి సంజయ్

by Bhanu |

నక్సలైట్లు తుపాకులు వీడి జనంలోకి రావాలని, తెలంగాణ రాష్ట్రానికి రూ 12 లక్షల కోట్లను భారతీయ జనతా పార్టీ ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బంటి సంజయ్ అన్నారు. సోమవారం రామగుండం ఎన్టిపిసి లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణకు రు 12 లక్షల కోట్ల ఇచ్చాం : బండి సంజయ్
X

దిశ, గోదావరిఖని : నక్సలైట్లు తుపాకులు వీడి జనంలోకి రావాలని, తెలంగాణ రాష్ట్రానికి రూ 12 లక్షల కోట్లను భారతీయ జనతా పార్టీ ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బంటి సంజయ్ అన్నారు. సోమవారం రామగుండం ఎన్టిపిసి లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు కేంద్రం మాకు ఏమి ఇయ్యలేదు అనడం వారి అవగాహన లోపం అన్నారు. రైల్వే ప్రాజెక్టులు, వడ్లు కొనుగోలు, జాతీయ రహదారులు ఇలా అనేక ప్రాజెక్టులను తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే నక్సలైట్ల మీద నిషేధం విధించిందని, ఇప్పుడు సిగ్గు లేకుండా నక్సలైట్ల కోసం మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. జాతీయ జెండాను ఎగరవేసిన వాళ్లే దేశ భక్తులని, నల్లజెండాలు పట్టుకొని అమాయక పోలీసులను, రాజకీయ నాయకులను, ప్రజలను చంపటమేమిటని ప్రశ్నించారు.


దుద్దిల్ల శ్రీపద రావు లాంటి మహానేతనే చంపారని, కేంద్ర బలగాలను బాంబులు పెట్టి చంపితే చూస్తూ ఊరుకుంటారా అన్నారు. ఇలా చేసి మీరు సాధించింది ఏంటని మీకు మీరే ప్రశ్నించుకోవాలన్నారు. భారతదేశంలో ఎలాంటి అరాచక శక్తులకు స్థానం లేదని హెచ్చరించారు. పహల్గామ్ దాడిలో అమాయక ప్రజలను చంపటం సరైనది కాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు 6 గ్యారంటీలు ఏమని ప్రశ్నిస్తున్నారని, 420 హామీలు ఇచ్చి గద్దెనిక్కారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, నాయకులు కందుల సంధ్యారాణి, బలుమూరి వనిత, అమరేందర్ రావు. మెరుగు హనుమంతు గౌడ్, ఖ్యాతం వెంకటరమణ, సోమారపు లావణ్య, పెద్దపల్లి రవీందర్, గుండవేన భూమయ్య, మచ్చ విశ్వాస్, శ్యాం పటేల్, నవీన్ గౌడ్, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.


Next Story