- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టులో అక్రమాలపై బీజేపీ గళం
by Ratna Kumari |
మల్యాల మండల బీజేపీ ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆలయ ఈవోకు వినతిపత్రం సమర్పించారు.

X
దిశ, కొండగట్టు : మల్యాల మండల బీజేపీ ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆలయ ఈవోకు వినతిపత్రం సమర్పించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాల్లో రుసుములు వసూలు చేయకుండా సీసీ కెమెరాలు, శాశ్వత బోర్డులు ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం డిమాండ్ చేశారు. సెక్యూరిటీ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని ప్రతిరోజూ అందుబాటులో ఉంచాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామి, రాజశేఖర్, రాములు, రవి, కిషన్, రమేష్ పాల్గొన్నారు.
Next Story






