రాజీరెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో ఫోన్ లో మాట్లాడిన బండి సంజ‌య్

by Nallavelli.Anjaneyulu |

ఎల్లారెడ్డి మండ‌ల కేంద్రానికి చెందిన సీనియ‌ర్ బీజేపీ నాయ‌కులు చందుప‌ట్ల రాజీరెడ్డి ఈనెల 17న అక‌స్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు.

రాజీరెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో ఫోన్ లో మాట్లాడిన బండి సంజ‌య్
X

దిశ‌, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డి మండ‌ల కేంద్రానికి చెందిన సీనియ‌ర్ బీజేపీ నాయ‌కులు చందుప‌ట్ల రాజీరెడ్డి ఈనెల 17న అక‌స్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న కేంద్ర హోంశాఖ స‌హాయ‌క మంత్రి బండి సంజ‌య్ శుక్ర‌వారం ఢిల్లీ నుంచి ఫోన్ లో రాజీరెడ్డి కుటుంబ స‌భ్య‌లతో మాట్లాడి మ‌నో ధైర్యాన్ని క‌ల్పించారు. మీకు నేను ఉన్నాను బాధ ప‌డొద్దు. ధైర్యంగా ఉండాల‌ని రాజీరెడ్డి కూతురు స్వాతిక రెడ్డి, కుమారుడు అక్షిత్ రెడ్డి తో మాట్లాడారు. ఢిల్లీ నుంచి రాగానే ఇంటికి క‌లుస్తాన‌ని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్.

Next Story