మావోయిస్టు పార్టీ పై నిషేధాన్ని ఎత్తివేయాలి

by Ratna Kumari |

సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు పార్టీ పై కొనసాగుతున్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి డిమాండ్ చేశారు.

మావోయిస్టు పార్టీ పై నిషేధాన్ని ఎత్తివేయాలి
X

దిశ, శంకరపట్నం : సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు పార్టీ పై కొనసాగుతున్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టులపై నిషేధం ఎత్తివేస్తే రాజ్యాంగ బద్ధంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తామని ప్రకటిస్తున్నారని, మరి అలాంటప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం కొనసాగించకుండా ఎత్తి వేయాలని ఆయన కోరారు. సీపీఐ(ఎం.ఎల్) మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి బీర్పూర్ లక్ష్మణరావు ఎక్కడ ఉన్నాడో ప్రకటిస్తామని సదరు పార్టీ నాయకులు దేవ్ జీ, మల్లారెడ్డి లు ప్రకటించారని ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. అంతే కాకుండా రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు .

Next Story