ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కల్పించాలి

by Ratna Kumari |

ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కల్పించాలి
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ ఉత్సవాల్లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, 2026 ప్లాస్టిక్ వేస్ట్ నిర్వహణ, పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్లను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధ‌వారం కలెక్టర్ గరిమ అగ్రవాల్, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజలు ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులని వాడొద్దని, కొత్త నియమాలను అనుసరించి గృహ ఘన వ్యర్థాలను తడి చెత్త , పొడి చెత్త , సానిటరీ చెత్త, ఇతర చెత్త ఇలా నాలుగు రకాలుగా విభజించాలని సూచించారు. ప్రజలందరికీ ఘన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ గురించి అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, ఏఈఈ కాలుష్య నియంత్రణ మండలి పాల్గొన్నారు.

Next Story