- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంకు సేవలపై అవగాహన సదస్సు
by Ratna Kumari |
బ్యాంకు అందించే సేవలపట్ల శుక్ర వారం రోజు ప్రజలకి విడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

X
దిశ,పెగడపల్లి : బ్యాంకు అందించే సేవలపట్ల శుక్ర వారం రోజు ప్రజలకి విడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కొడిమ్యాల విడ్స్ సీఎఫ్ఎల్ కౌన్సిలర్ నరేష్ పొదుపు ఖాతాల ఆవశ్యకత, వివిధ రకాల రుణాలు, ప్రజలకి ఉపయోగపడే పథకాల గురించి వివరించారు. అదే విధంగా డిజిటల్ అరెస్ట్ గురించి సూచనలు ఇస్తూ బ్యాంక్ పేరు మీద ఫోన్ కాల్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముంజ మహేశ్వరి మధుకర్, సీఎఫ్ఎల్ కౌన్సిలర్స్ శంకర్, కృష్ణవేణి, నరేష్, ప్రజలు పాల్గొన్నారు.
Next Story






