- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై దాడి యత్నం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు చల్మెడ ఆదేశాల మేరకు పట్టణంలోని తెలంగాణ చౌక్ లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

దిశ, వేములవాడ టౌన్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు చల్మెడ ఆదేశాల మేరకు పట్టణంలోని తెలంగాణ చౌక్ లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ , కాంగ్రెస్ గుండాల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. బీజేపీ గుండాలారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో మిట్ట మధ్యాహ్నం పూట అందరూ చూస్తున్న వేళ ఎమ్మెల్యే పాడి కౌశిక్ పై బీజేపీ గుండాలు చంపే ప్రయత్నం చేశారని , కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇబ్బందుల పెడుతున్నారని అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై రాజకీయ చర్చలు జరగాలి గానీ భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనం, ప్రభుత్వ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఏస్ నాయకురాలు పావని గౌడ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించినా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






