మాజీ సర్పంచ్‌పై దాడి కేసులో మాజీ జెడ్పీటీసీ భర్తపై అట్రాసిటీ కేసు

by Bhanu |

మండలంలోని మండెపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తంగళ్లపల్లి దేవయ్యపై జరిగిన దాడి ఘటనలో తంగళ్లపల్లి మాజీ జెడ్పీటీసీ భర్త పూర్మాని లింగారెడ్డితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

మాజీ సర్పంచ్‌పై దాడి కేసులో మాజీ జెడ్పీటీసీ భర్తపై అట్రాసిటీ కేసు
X

దిశ, తంగళ్లపల్లి : మండలంలోని మండెపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తంగళ్లపల్లి దేవయ్యపై జరిగిన దాడి ఘటనలో తంగళ్లపల్లి మాజీ జెడ్పీటీసీ భర్త పూర్మాని లింగారెడ్డితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే… 2024 సెప్టెంబర్ 4న దేవయ్యపై పూర్మాని లింగారెడ్డితో పాటు మరికొందరు కలిసి దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు.


ఈ ఘటనపై తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ ఉన్నతాధికారులను దేవయ్య కలిశారు. దీంతో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పూర్మాని లింగారెడ్డితో పాటు మరికొందరిపై అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బాధితుడు వెల్లడించారు. ఈ కేసు మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది.



Next Story