దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

by Disha Web Desk 1 |
దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: గత 15 రోజులుగా జిల్లాలో పలుచోట్ల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వేర్వేరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఇనిస్టిట్యూట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గడ్డమీది మునిందర్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్ వద్ద వృద్ధురాలి మెడలోంచి మూడు తులాల బంగారు చైన్ దొంగిలించాడు.

అదేవిధంగా మొహమ్మద్ అఖిల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద మహిళ మెడలోంచి 1.5 తులాల రోల్డ్ గోల్డ్ చైన్ తో పాటుగా ఒక వాహనం, పట్టణం లోని సాయి బాబా గుడి వద్ద మహిళ మెడలోంచి 39 గ్రాముల బంగారు పుస్తెల తాడు దొంగిలించినట్లు తెలిపారు. మరో ఘటనలో బోల్లవెని మహేష్, బొల్లవెని రాజేష్ లు మెట్ పల్లి పట్టణంలోని వైన్ షాప్, మెట్ పల్లి మండలంలోని వెంపేట లోని కిరాణ షాపు తాళం పగలగొట్టి దొంగతనం చేసి పారిపోయారు. ఆ ఘటనలో వారి మీద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఆ నిందితులే మల్యాల మండలంలో కోడిగుడ్ల ఆటోను కూడా దొంగిలించారని తెలిపారు. కేసులను సవాలుగా తీసుకున్న జిల్లా పోలీసులు జగిత్యాల, మెట్ పల్లి డీఎస్పీ ప్రకాష్, రవీందర్ రెడ్డి అధ్వర్యంలో పది బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించి తక్కువ సమయంలోనే దొంగలను గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు. నిందితుల నుంచి 39 గ్రాముల బంగారం, ఒక బైక్, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు రమణ మూర్తి, లక్ష్మీనారాయణ, కిషోర్, ఆయా మండలాల ఎస్సై లను ఎస్పీ భాస్కర్ ప్రత్యేకంగా అభినందించారు.


Next Story