సింగరేణి అధికారులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి.. ఏఐటీయూసీ డిమాండ్

by Disha Web Desk 4 |
సింగరేణి అధికారులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి.. ఏఐటీయూసీ డిమాండ్
X

దిశ, గోదావరిఖని: ఏఎల్ పీ అండర్ గ్రౌండ్ లాంగ్ వాల్ మైన్ లో చట్టానికి విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా వీటీసీ ట్రైనింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ ను అండర్ గ్రౌండ్ లో దించి ఆయన చావుకు కారణమైన ఏఎల్ పీ మేనేజర్, ఏరియ జనరల్ మేనేజర్ లపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కేంద్ర అధ్యక్షులు కడారి సునీల్ ఆర్జీ-1 కార్యదర్శి శనిగల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించి సింగరేణిలో పర్మినెంటు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులు సీఎండీ దగ్గర మెప్పు పొందేందుకు సేఫ్టీ రక్షణ గాలికి వదిలేసి ఉత్పత్తి ప్రధానలక్ష్యంగా వీటీసీ ట్రైనింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను మైన్ లోకి పంపడం చూస్తుంటే వీరి అత్యాస అర్థమవుతుందని అన్నారు. డీజీఎంఎస్ నామ్స్ కు విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ నిండు ప్రాణానికి కారణమైన సింగరేణి అధికారులను కఠినంగా శిక్షించాలని, కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed